నేపాల్ లో మళ్లీ భూకంపం..
ఖాట్మాండు: నేపాల్ లో మళ్లీ భూకంపం సంభవించింది. 12.45 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రతం రిక్టర్ స్కేలుపై 6.9 శాతంగా నమోదు అయింది. బహుళ అంతస్తులు పేక మేడల్లా కూలిపోతున్నాయి. నేపాల్ లోని ఖాద్రా అనే ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైంది. 24 గంటలలో 30 సార్లు భూ ప్రకంపనలు జరిగాయి. నిన్న సంభవించిన భూకంపానికి ఇప్పటికే 2500 మృతి చెందారు. 2వేల మృత దేహాలను వెలికితీశారు. ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు, సహాయక బృందాలు సహాయకచర్యల్లో నిమగ్నమయ్యారు. తాజాగా మళ్లీ నేపాల్ లో భూకంపం రావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. హిమాలయాల వైపు భూకంపం వస్తుందని చెబుతున్నారు. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు.