నేరం చేశానా? – మోడీ

 mann-ki-baat-government-constructing-5-lakh-farming-pools-says-pm-narendra-modiపెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తిప్పికొట్టారు. భారత ప్రజలే తన అధిష్ఠానమని చెబుతూ నల్లధనం, అవినీతిపై దాడిచేసి తానేమైనా అని ప్రజల్ని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన భాజపా పరివర్తన్‌ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ముందుగా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, పశ్చిమ్‌బంగా వంటి పెద్ద రాష్ట్రాల్లో పేదరికాన్ని తరిమికొట్టాలని పేరొన్నారు. ఎంపీ కావడానికి మాత్రమే ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి పోటీ చేయలేదు. పేదరికంపై పోరాటం తొలుత ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఈ పెద్ద రాష్ట్రాన్ని ఎంచుకొన్నాను. చాలా ప్రభుత్వాలు చాలా సార్లు చాలా హామీలిచ్చాయి. పారదర్శకత, జవాబుదారీతనం పైనే మేము దృష్టి సారించాం.నల్లధనాన్ని జన్‌ధన్‌ఖాతాల్లో జమచేసిన అవినీతిపరులను జైల్లో వేసేందుకు ఉన్న దారులను వెతుకుతున్నాను అని అన్నారు.