నేరాల నియంత్రణకు గ్రామాల్లో సీసీ కెమెరాలు అవసరం
– సీఐ బాలకృష్ణ
అశ్వరావుపేట సెప్టెంబర్ 6 ( జనం సాక్షి ) నేరాల నియంత్రణకు ప్రతి గ్రామాల్లో సీసీ కెమెరాలు అవసరమని అశ్వరావుపేట సిఐ బి బాలకృష్ణ అన్నారు. మంగళవారం తిరుమలకుంటలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సీఐ బాలకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తిరుమల కుంట సర్పంచ్ సున్నం సరస్వతి, ఉపసర్పంచ్ జుజ్జూర్ రాంబాబు, ఎంపీటీసీ నాగలక్ష్మి లతో సీసీ కెమెరాల పనితీరును లైవ్ లో చూసి తిలకించారు. ఈ సందర్భంగా సిఐ బాలకృష్ణ మాట్లాడుతూ పంచాయతీలో సీసీ కెమెరాలు పెట్టడం వల్ల నేరాలు నియంత్రించవచ్చని, పొరపాటున ఏదైనా దొంగతనం జరిగితే సీసీ కెమెరాలు ద్వారా చిన్న క్లూ తో దొంగలను పట్టుకోవచ్చు అన్నారు. ప్రతి పంచాయతీల్లో గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు వ్యాపారస్తులు ఐక్యతగా ఉండి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోగ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు