నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిషేధిత చట్టంపై మోడల్ స్కూల్లో అవగాహన సదస్సు.

నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిషేధిత చట్టంపై మోడల్ స్కూల్లో అవగాహన సదస్సు.

మల్లాపూర్ అక్టోబర్ 11(జనంసాక్షి)జాతీయ న్యాయ సేవ సమితి ఆదేశాల మేరకు మల్లాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు బాలవివాహాల నిషేధిత చట్టంపై అవగాహన కల్పించడం జరిగింది బాల్య వివాహాలు లేనటువంటి భారతదేశాన్ని నిర్మిద్దామని మరియు బాల్య వివాహాలు చేసుకున్నటువంటి వారు చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు మరియు బాలల హక్కుల పరిరక్షణ కొరకు వారి యొక్క స్వేచ్ఛ భద్రత కొరకు మరియు లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరు కూడా బాల్యవివాహాలను ప్రోత్సహించవద్దు మరియు చేసుకోరాదని బాలవిహాల నిషేధిత చట్టం స్పష్టంగా చెబుతున్నందువల్ల ప్రతి ఒక్కరు పాటించాలని తెలపడం జరిగింది. మరియు బాల్య వివాహాలు చేసుకోమని విద్యార్థులతో ప్రమాణం చేయించడం జరగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నల్ల రాజేందర్ ఎర్ర రమేష్ మరియు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అలియోద్దిన్, ఆకుతోట నరేష్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు