నోటీ ముత్యాలు రాలుతాయా? జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబుపై కొల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. జై తెలంగాణ అంటే నోటి ముత్యాలు రాలుతాయా అని ప్రశ్నించారు. జై తెలుగుదేశం బోనం ఎత్తుకుంటావు కానీ , జై తెలంగాణ బోనం ఎందుకు ఎత్తుకోవు అని నిలదీశారు. తెలంగాణ బోనం ఎత్తి దించడం చాలా బాధాకరమన్నారు. వందలాది మంది ప్రాణత్యాగాల కంటే బాబు పాదయాత్ర ముఖ్యమా అని ప్రశ్నించారు. వరంగల్‌ జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండి బాబుతో ఎందుకు జై తెలంగాణ అనిపించడం లేదని అడిగారు.