నోట్ల ర‌ద్దు చ‌ర్య న్యాయ‌ప‌ర‌మైన దోపిడీ

manmohan-singh_147నోట్ల ర‌ద్దు అంశంపై ఇవాళ రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ మొద‌లైంది. మాజీ ప్ర‌ధాని, కాంగ్రెస్ ఎంపీ మ‌న్మోహ‌న్ సింగ్ నోట్ల ర‌ద్దుపై మాట్లాడారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల సామాన్య ప్ర‌జ‌లకు కలిగిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలని మ‌న్మోహ‌న్ అన్నారు. నోట్ల ర‌ద్దు తుది ఫ‌లితం ఎలా ఉంటుందో తెలియ‌ద‌న్నారు. పేద ప్ర‌జ‌ల‌కు 50 రోజుల గ‌డ‌వు ఇవ్వ‌డం దారుణన్నారు. దాని వ‌ల్లే 65 మంది చ‌నిపోయారన్నారు. ప్రాక్టీక‌ల్ ప‌ద్ధ‌తిలో ఆలోచించాల‌ని ప్ర‌ధాని మోదీకి మ‌న్మోహ‌న్ విన్న‌వించారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల చాలా స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యార‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం విస్మ‌రిస్తోంద‌న్నారు. నోట్ల ర‌ద్దు చ‌ర్య వ‌ల్ల ప్ర‌జ‌ల్లో క‌రెన్సీ వ్య‌వ‌స్థ ప‌ట్ల న‌మ్మ‌కం స‌డ‌లిపోతుంద‌న్నారు. ఈ ప్ర‌య‌త్నం వ‌ల్ల ఆర్బీఐ డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డింద‌ని విమ‌ర్శించారు. నోట్ల ర‌ద్దు చ‌ర్య ఓ వ్య‌వ‌స్థీకృత, న్యాయ‌ప‌ర‌మైన దోపిడీ అన్నారు. నల్లధనాన్ని బయటకు తీసేందుకు భారీ ప్రణాళికలతో ప్రధాని ముందుకు రావాలని మన్మోహన్ కోరారు. నోట్ల రద్దు వల్ల గ్రామీణ సహకార రంగ బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. చిన్న పరిశ్రమలకు కూడా భారీ నష్టం వాటిల్లిందన్నారు. నోట్ల రద్దు చర్య ప్రభుత్వ నిర్వహణ వైఫల్యమని మన్మోహన్ తీవ్రంగా విమర్శించారు.