న్యాయం చేయాలంటూ యువతి ధర్నా
వేలేరుపాడు: ప్రేమించిన యువకుడితో తనకు పెళ్లి చేయాలంటూ గిరిజన యువతి స్థానిక ఠాణా ఎదుట ధర్నాకు దిగింది. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన మడివి వనజ కన్నాయగుట్టకు చెందిన కుంజా సాగర్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట తనను పెళ్లి చేసుకోవాలని వనజ సాగర్‌ను
నిలదీయగా అతను నిరాకరించి గ్రామం నుంచి వెళ్లిపోయాడు. దీంతో వనజ సాగర్‌తో తనకు వివాహం జరిపించాలని కోరుతూ ఠాణా ఎదుట బైఠాయించింది.