న్యాయం చేయాలని కోరుతూ రహదారిపై రాస్తారోకో

సునీల్ మృతికి కారకులాయిన వారిని కఠినంగా శిక్షించాలి

విచారణలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యం
మృతుని తల్లి సరోజ ,తండ్రి జగన్ డిమాండ్.

బాధితులకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

నిష్పక్షపాతం గా విచారిస్తాం :సిఐ రవికుమార్.

కురివి అక్టోబర్ -13
(జనం సాక్షి న్యూస్)

కురవి మండలంలో లింగ్యా తండా (బి) గ్రామపంచాయతీ పరిధిలో ఈనెల ఎనిమిదో తారీకు అర్ధరాత్రి ఫ్రెండ్స్ తో వెళ్లిన తమ కొడుకు మాలోత్ సునీల్ మృతి చెందడం అనుమానాలు వ్యక్తం చేస్తూ స్థానిక కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారులు పట్టించుకోవడంలేదని మృతుని తల్లిదండ్రులు మాలోత్ సరోజా జగన్ కుటుంబ సభ్యులు మిత్రులు మండల కేంద్రంలోని నేషనల్ హైవే 365 పై సుమారు 30 నిమిషాలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుని తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని తమ కొడుకు మృతికి స్థానిక నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. తమ కొడుకు మృతికి కారణమైన వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తమ కొడుక్కి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు డివై గిరి, వద్దుల మహేందర్ రెడ్డి, శ్యామల శ్రీనివాస్, మాలోత్ హరిలాల్, ఎడ్ల వెంకన్న, గుగులోత్ నవీన్, కళ్యాణ్ సాయి ధర్నా లో పాల్గొని మద్దతు తెలిపారు.కురవి ఎస్ఐలు రాము నాయక్, మధుబాబు లు రాస్తారోకో వద్దకు చేరుకున్నారు. ఆందోళన కారులకు విరమింపచేయాలని సర్థి చెప్పారు వారు వినకపోవడంతో అక్కడికి వచ్చిన మహబూబాబాద్ రూరల్ సీఐ రవి కుమార్ పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ చేస్తామని మాలోతు సునీల్ మృతికి కారకులైన వారు ఎంతటి వారినైనా శిక్షిస్తామని ఆయన ఆందోళనకారులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఎస్సై రాము నాయక్ కి వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా అనుమానితులను విచారించి సునీల్ మృతికి కారణమైన దోషులను చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ ధర్నాలో
అనిల్ ,వంశీ,అజయ్, యశ్వంత్ సాయి, గణేష్,అనిల్ ,నరేష్, అభి,సంపత్,సుమన్ తేజ,రవి,సాగర్ తదితరులు పాల్గొనారు.