న్యాయ వ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్ వారి హక్కు`
దీన్ని డిమాండ్ చేయడానికి వీరు అర్హులు
` దసరా తర్వాత ప్రత్యక్ష విచారణ` జస్టిస్ ఎన్.వి.రమణ
దిల్లీ,సెప్టెంబరు 26(జనంసాక్షి):దేశ న్యాయవ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. న్యాయ కళాశాలల్లోనూ ఇదే తరహా రిజర్వేషన్ అవసరమని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి సహా నూతనంగా నియమితులైన తొమ్మిది మంది జడ్జిలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా.. మహిళా న్యాయమూర్తులను ఉద్దేశించి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. ‘రిజర్వేషన్ విూ హక్కు.. దాన్ని డిమాండ్ చేయడానికి విూరు అర్హులు’ అని వెల్లడిరచారు.జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ..‘దిగువ కోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు 30శాతం కంటే తక్కువే. హైకోర్టుల్లో అది 11.5 శాతం. సుప్రీంకోర్టులో 11`12 శాతం మాత్రం మాత్రమే ఉన్నారు. న్యాయవ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అవసరం. ఇది వేల సంవత్సరాల అణచివేతకు సంబంధించిన సమస్య’ అని అన్నారు. ‘దేశంలోని 1.7 మిలియన్ల న్యాయవాదులు ఉండగా.. అందులో 15శాతమే మహిళలు. రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో ఎన్నికయ్యే మహిళా ప్రజాప్రతినిధులు 2శాతమే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిటీలో ఒక్క మహిళా ప్రతినిధి కూడా ఎందుకు లేరని నేను ప్రశ్నిస్తున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలని ఆశించారు.మహిళా న్యాయవాదులు ఎదుర్కొనే సమస్యలపైనా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. అసౌకర్యమైన పని వాతావరణం. మహిళా వాష్‌రూమ్‌లు, బేబీ కేర్ సెంటర్ల గురించి చర్చించారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడిరచారు. నేడు కుమార్తెల దినోత్సవం సందర్భంగా మహిళకు శుభాకాంక్షలు తెలియజేశారు.కోర్టుల్లో దసరా తర్వాత ప్రత్యక్ష విచారణదసరా తర్వాత కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో ఇవాళ దిల్లీలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ‘‘ ప్రత్యక్ష విచారణతో న్యాయమూర్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. న్యాయవాదులకే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లా కళాశాలల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించాలి. మహిళలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లకు నా మద్దతు ఉంటుంది. మహిళలంతా ఐక్యంగా ఉండాలి. కోర్టుల్లో మహిళా న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలి. వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి’’ అని జస్టిస్ ఎన్వీరమణ అన్నారు.
4.భరోసా ఇస్తాం.. విమాన సర్వీసులు ప్రారంభించండి..!` విమానయాన సంస్థలకు తాలిబన్ల విజ్ఞప్తికాబుల్,సెప్టెంబరు 26(జనంసాక్షి): అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నెల గడుస్తునప్పటికీ అంతర్జాతీయ సమాజం నుంచి వారికి సరైన సహకారం లభించడం లేదనే చెప్పవచ్చు. చాలా దేశాలు అఫ్గాన్‌కు పౌర విమాన సేవలు పూర్తిగా నిలిపివేయగా.. పరిమితి సంఖ్యలో మాత్రమే అత్యవసర, సహాయ కార్యక్రమాలను అందించే విమానాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని తాలిబన్లు ప్రకటన చేశారు. కాబుల్ విమానాశ్రయంలో ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్కబడ్డాయని.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వీసులు కొనసాగేలా విమానయాన సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడిరచారు.‘కాబుల్ ఎయిర్‌పోర్టులో సమస్యలన్నీ చక్కబడ్డాయి. ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఎయిర్‌పోర్టు సిద్ధంగా ఉంది. విమాన సర్వీసులు సజావుగా సాగేలా సహకారం అందించేందుకు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ (ఎఇం) హావిూ ఇచ్చింది’ అని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అబ్దుల్ ఖహార్ బఖ్కీ ఓ ప్రకటన చేశారు. అంతర్జాతీయ విమానాలు రద్దు కావడం వల్ల విదేశాల్లో ఎంతోమంది అఫ్గాన్లు చిక్కుకుపోయారని.. వీటికి తోడు చదువు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే అఫ్గాన్ వాసులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు.ఇదిలాఉంటే, అఫ్గానిస్థాన్‌ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో వివిధ దేశాల పౌరులను తరలించే ప్రక్రియ కూడా సవాల్‌గా మారింది. తమ దేశాన్ని వీడి పారిపోయేందుకు వేల మంది అఫ్గాన్ వాసులు కాబుల్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడే పడిగాపులు కాశారు. అదే సమయంలో జంట పేలుళ్లతో కాబుల్ ఎయిర్‌పోర్టు అట్టుడుకిపోయింది. ఇలా వరుస పరిణామాలతో కాబుల్ విమానాశ్రయం మొత్తం దెబ్బతినడంతో విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి. కేవలం పాకిస్థాన్ మాత్రమే పరిమిత సంఖ్యలో విమానాలను నడుపుతోంది. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. ఓవైపు అంతర్జాతీయ సమాజంతో సంబంధాలను నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. మరోవైపు హింసాత్మక ధోరణినే అవలంభిస్తున్నారు. దీంతో తాలిబన్లతో సంబంధాలపై ఆయా దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి.