న్యూజిలాంట్‌ హ్యాట్రిక్‌ విజయం

ఇంగ్లండ్‌ను చిత్తుచేసి గెలిచిన కివీస్‌
వెల్లింగ్టన్‌,ఫిబ్రవరి20: మంచి ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ శుక్రవాకం ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో వరుసగా మూడు మ్యాచ్‌లను గెల్చుకుని హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. తొలుతు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తడబడుతూ ఆడి కేవలం 123 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.  స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ఓపెనర్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ చెలరేగి ఆడటంతో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.2 ఓవర్లలో లక్ష్యాన్ని అలవోకగా లద్కదించింది. కేవలం 25 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో మెక్‌కలమ్‌ 77 పరుగులు చేసి వోక్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గప్తిల్‌(22) రాణించగా.. విలియమ్సన్‌(9), టైలర్‌(5) లాంఛనాన్ని పూర్తి చేశారు. ప్రపంచకప్‌ లో భాగంగా ఇంగ్లండ్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనితో ప్రపంచకప్‌ లో మూడో విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్‌ విసిరిన 123 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో న్యూజిలాండ్‌ ఓపెనర్లు గుప్టిల్‌, మెక్‌ కల్లమ్‌ బరిలోకి దిగారు. ఆరంభం నుండే మెక్‌ కల్లమ్‌ విజృంభించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. 13 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ నమోదు చేసి వరల్డ్‌ కప్‌ 2015 రికార్డు సృష్టించాడు. సెంచరీ దిశగా వెళుతున్న మెక్‌ కల్లమ్‌ జోరుకు వోక్స్‌ కళ్లె వేశాడు. జట్టు స్కోరు 105 పరుగుల వద్ద వోక్స్‌ బౌలింగ్‌ మెక్‌ కల్లమ్‌ (77) పెవిలియన్‌ చేరాడు. అనంతరం గుప్టిల్‌ (22) వికెట్‌ కోల్పోయింది. అనంతరం జట్టు విజయానికి కావాల్సిన పరుగులను కేన్‌ విలియమ్సన్‌ (9 నాటౌట్‌ ), రోస్‌ టేలర్‌ (5 నాటౌట్‌)లు చేశారు. 12.2 ఓవర్లలో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. అంతకుముందు బ్యాటింగ్‌ కు దిగిన ఇంగ్లండ్‌ ను కివీస్‌ బౌలర్‌ సౌతీ నడ్డివిరిచాడు. ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌ బ్యాట్‌ మెన్స్‌ లలో రూట్‌ (46) ఒక్కడే రాణించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌతీ ఏడు వికెట్లు, బౌల్ట్‌, అడం, వెటోరి తలో వికెట్‌ తీశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ రెండు వికెట్లు తీశారు. న్యూజిలాండ్‌ బౌలర్‌ సౌథీ దెబ్బకు విలవిల్లాడింది. 33.2 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆరుగురు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇందులో ఇద్దరు డకౌట్‌గా వెనుదిరగటం విశేషం. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ బౌలర్‌ సౌథీ ఆది నుంచి ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు. 36 పరుగులకే ఓపెనర్లు బెల్‌(8), మొయీన్‌ అలీ(20)లను క్లీన్‌ బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపడంతో షాక్‌ తిన్న ఇంగ్లాండ్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడినప్పటికీ జట్టు స్కోరు 57 పరుగుల వద్ద బాలెన్స్‌(10) రూపంలో మూడో వికెట్‌ కోల్పోయింది. అనంతరం రూట్‌ ఇన్నింగ్స్‌ నిర్మించే బాధ్యతను తీసుకుని కెప్టెన్‌ మోర్గాన్‌(17)తో కలిసి సంయమనంతో ఆడాడు. నాలుగో వికెట్‌కి వీరు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే 104 పరుగుల వద్ద మోర్గాన్‌ వికెట్‌ అనంతరం ఇంగ్లాండ్‌ క్రమంగా వికెట్లు కోల్పోతూ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. వరుసగా టైలర్‌(0), బట్లర్‌(3), వోక్స్‌(1), బ్రాడ్‌(4), ఫిన్‌(0)లను పెవిలియన్‌కు పంపిన సౌథీ ఇంగ్లాండ్‌ను 123 పరుగులకే కుప్పకూల్చాడు. మూడో వికెట్‌ అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రూట్‌(46) ఒక్కడే నిలకడగా ఆడుతూ ఒంటరి పోరాటం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్‌లో సహచరుల నుంచి ఎలాంటి సహకారం అందలేదు. రూట్‌ ఆదుకోకుండా ఉంటే ఇంగ్లాండ్‌ పరి/-థసితి మరింత ఘోరంగా ఉండేది. కనీసం వంద పరుగుల మార్కును కూడా దాటేది కాదు.