న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్‌ విమానాశ్రయంలో కనిపిస్తున్న సైన్‌బోర్డు 

న్యూఢిల్లీ  (జనంసాక్షి)
ఒకటి ఆన్‌లైన్‌లో చర్చకు కారణమైంది.
తమవారిని సాగనంపేందుకు వచ్చేవారు మూడు నిమిషాలకు మించి హగ్‌ చేసుకోకూడదట. లేదూ.. ఇంకా సమయం కావాలంటే మాత్రం డ్రాప్‌-ఆఫ్‌ ఏరియాకు బదులు కార్‌ పార్కింగ్‌ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చట. గరిష్ఠంగా మూడు నిమిషాలు మాత్రమే హగ్‌ చేసుకోవాలని రాసున్న సైన్‌బోర్డును ఫొటోతీసిన ఒకరు దానిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది.
నెటిజన్లు రెండుగా విడిపోయి దీనిపై చర్చించుకుంటున్నారు. ఇది మంచి నిర్ణయమని ఒకవేళ ఆపేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే 5 నుంచి 100 పౌండ్ల వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుందని ఒకరు కామెంట్‌ చేస్తే, మరీ మూడు నిమిషాలేనా? అమెరికాలో అయితే ఆపాలని కూడా ఎవరూ అనుకోరు! అని మరొకరు రాసుకొచ్చారు. ఈ సైన్‌బోర్డు ఏర్పాటుపై డ్యునెడిన్‌ ఎయిర్‌పోర్టు సీఈవో డేనియల్‌ డి బోనో మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టులు ఎమోషనల్‌ హాట్‌స్పాట్లని, 20 సెకన్లు హగ్‌ చేసుకున్నా లవ్‌ హార్మోన్‌ ఆక్సిటోసిన్‌ విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈ ఏర్పాటు వల్ల ఎక్కువమందికి హగ్‌ చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.