పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేస్తాం
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 28 (జనంసాక్షి)
పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి తమ ప్ర భుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలంగాణ పం చాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశా రు. వివిధ రాష్గాల్లోని అత్యుత్తమ విధానాలను అ నుసరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొ న్నారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాబి óవృద్ధిశాఖల బలోపేతంపై ఈరోజు ఆయన మేథో మథనం నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి విజ యానంద్, ఉన్నతాధికారులు, విశ్రాంత ఐఏ ఎస్‌లు, నిపుణులు ఇందులో పాల్గొన్నారు. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, విధులు, నిధుల బదలాయింపుపై ఇందులో చర్చించారు. గ్రామీణ ప్రజల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వ పనిచేస్తుందని.. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.