పంచాయితీ కార్మికుల ఆందోళన ఉధృతం
ధనిక రాష్ట్రంలో బిచ్చమెత్తుకోవాలా?
నిజామాబాద్,ఆగస్ట్18(జనం సాక్షి): గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 27 రోజు మండల కార్యాలయం నిర్వహించగా వారి సమ్మె శిబిరానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాహన్ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శవయాత్ర గా కోర్టు చౌరస్తా ధర్నా చౌక్ ఎన్టీఆర్ చౌరస్తా వద్దకు శవయాత్ర ర్యాలీగా వచ్చి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కార్మికులు వెట్టి చాకిరి చేయటం అన్యాయమని అన్నారు. అతి తక్కువ వేతనాలతో గ్రామ ప్రజల అవసరాలను తీరుస్తూ పరిశుభ్రత స్వచ్ఛమైన నీరు విద్యుత్తు అందించే కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపకపోవడం దారుణమన్నారు. పశ్చిమబెంగాల్, కేరళ కర్ణాటక రాష్టాల్లో కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారని, అదేవిధంగా మన రాష్ట్రం కూడా సమస్యలను కార్మికుల పరిష్కరించ వచ్చు కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావటంలేదని విమర్శించారు. వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించే గ్రావిూణ ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందులను ఎదురుకాకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు కానీ అది అమలు జరపలేదు, కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ విద్య అమలు కాలేదు, అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందలేదు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్ కాలేదు అదేవిధంగా గ్రామపంచాయతీ మధ్యాహ్న భోజనం కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపట్లేదు ఉద్యోగ భద్రత లేదు అందువల్ల ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్తు, ఆర్ పి లు సమ్మె చేస్తున్నారు గతంలో ఆర్టీసీ, మున్సిపల్, ఐకెపి ఆశ అంగన్వాడి, ఇతర అనేక రంగాల కార్మికులు సమ్మె చేశారు ఈ ప్రభుత్వం తెలంగాణ వస్తే పోరాడవలసిన అవసరం లేదని చెప్పి పోరాడితే తప్ప సమస్యలను పరిష్కరించలేదు అందువల్ల ప్రభుత్వం అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలను కార్మికులను ఉద్యోగులను మోసం చేస్తుందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు బి.సంజీవ్,సురా రవి, గంగాధర్,వెంకట్,సురేష్ ఆర్.శ్యాం,సతీష్,రవి,మారుతీ, ఎం.సాయిలు,రవి,ఓంప్రకాష్, మైసయ్య, హైమద్,రాజు,లక్ష్మి, నర్శవ్వ, గ్రామపంచాయతీ కార్మికులు,ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.