పంచారామ శివక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : కార్తీక మాసంలో ప్రతి సోమవారం పంచారామ శివక్షేత్రాల దర్శనానికి భక్తుల కొరకు సూర్యాపేట ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపనున్నట్లు అసిస్టెంట్ మేనేజర్ వెంకటమ్మ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్ లో పంచారామ క్షేత్రాల దర్శనానికి సంబంధించిన కరపత్రాలను సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 30 , నవంబర్‌ 6, 13, 20వ తేదీల్లో పంచారామాలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని చెప్పారు.కార్తీక మాసంలో ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు సూర్యాపేట బస్టాండ్ నుండి బస్సులు బయలుదేరి మరుసటిరోజు సోమవారం పంచారామాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట శివ క్షేత్రాల దర్శనం చేయించి, తిరిగి మంగళవారం ఉదయం సూర్యాపేట చేరుకుంటాయని తెలిపారు. ఎక్స్ ప్రెస్ బస్ చార్జీలు పెద్దలకు రూ.1640 , పిల్లలకు రూ. 820 అని తెలిపారు.బస్సుకు సరిపడా ప్రయాణికులు ఉంటే కార్తీకమాసంలో ఏరోజైనా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు.అయ్యప్ప భక్తుల కొరకు శబరిమలైకు ఆర్టీసీ బస్సులను అద్దెకి ఇవ్వనున్నట్లు తెలిపారు.భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. టికెట్ రిజర్వేషన్ గురించి మరిన్ని వివరాలకు సెల్ నంబర్స్ డిపో మేనేజర్ 9959226306 ,
అసిస్టెంట్ మేనేజర్ 7382943199 , డిఆర్ కుమార్ 9948303712, 8247799393 సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్టీఐ నిర్మల, పంచారామాల బస్సుల ఇన్చార్జ్ డి.రవికుమార్ , హైటెక్ బస్టాండ్ కంట్రోలర్ ఎస్ఎస్ గౌడ్, మజీద్ , భాను , అజరుద్దీన్ , సైదులు తదితరులు పాల్గొన్నారు.