పంటలు గిట్టుబాటు కాక ఆందోళన

అరటి,మామిడికి దక్కని గిట్టుబాటు

కడప,జూలై30(జనంసాక్షి): ఆరుగాలం కష్టించి పంటలు పండిరచే రైతులు దళారులచేతుల్లో
దగాపడుతున్నారు. గిట్టుబాటు ధరలు ఉన్నా దళారులు మాత్రం రైతులకు ధరలులేవని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. దీంతో రైతులు ఉన్న ధరలతోనే సరిపెట్టుకునే దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడిరది. దీంతో రైతులను దళారులు నిలువునా ముంచుతున్నారు. రైల్వేకోడూరులో ప్రధానంగా మామిడి, అరటి, బొప్పాయి తదితర పంటలను సాగుచేస్తున్నారు. ఈఏడాదిలో పకృతివైపరీత్యాలు, చీడపీడలు, దళారులు తదితరవాటితో రూ.5కోట్లు విలువచేసే అరటి ఏటిపాలుకావడంతో రైల్వేకోడూరు రైతాంగం నిలువునా నష్టపోయింది. మొన్నటి వర్షాలకు కూడా ఉన్నది ఊడ్చుకుపోయిందని వాపోయారు. రైల్వేకోడూరు, ఓబులవారిప్లలె, చిట్వేలి తదితర మండలాల్లో వీచినగాలులకు అరటిచెట్లు పడిపోయాయి. అరటిధరలు బాగా ఉన్న సమయంలో ఇటీవల వర్షం కురిసిచెట్లు నేలకూలిపోయాయి. పక్వానికివచ్చిన గెలలు కళ్లముందే పడిపోవడంతో రైతులు విలవిలలాడారు. బొప్పాయి విషయానికి వస్తే ధరలు పూర్తిగా దళారులదే పెత్తనంగా మారింది. ఇకపోతే దళారులు, వ్యాపారులు కుమ్మక్కై ధరలుపెంచలేదు. మరోవైపు రైతులు దళారులతో తీవ్రంగా నష్టపోతున్నారు. అరటి, బొప్పాయి, మామిడికి ధరలు విషయంలో రైతులకు అనుకూలంగా ఉండాలన్నారు.