పంటల బీమాకు రూ.17.94కోట్లు మంజూరు
ఖమ్మం, జూలై 23: వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద 2011 ఖరీఫ్‌సీజన్‌లో పత్తి, మిర్చి పంటలు నష్టపోయిన రైతులకు 17.94 కోట్లు పరిహారం కింద బీమా సొమ్ము మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. 28,625 మంది రైతులకు బీమా సొమ్ము అందుతుందని పేర్కొన్నారు. మిర్చి సాగుచేసిన 12,569 మంది రైతులకు 12.37 కోట్లు, పత్తి సాగు చేసిన 16,064 మంది రైతులకు 5.56 కోట్లు మంజూరైనట్లు వివరించారు. బీమా కంపెనీ నేరుగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేస్తుందని పేర్కొన్నారు. మండలాల వారీగా జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. సంబంధిత మండల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి బీమా సొమ్ము వివరాలు తెలుసుకోవాలని రైతులకు సూచించారు.