పగిళ్ల శ్రీను మరణం తీరని లోటు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ జనసమితి పట్టణ ప్రధాన కార్యదర్శి పగిళ్ల శ్రీను మరణం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన పోరాటానికి తీరని లోటు అని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు.ఆదివారం జనసమితి జిల్లా కార్యాలయంలో జరిగిన పగిళ్ల శ్రీను సంతాప సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.సూర్యాపేట కేంద్రంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో శ్రీను చురుగ్గా పాల్గొన్నారని అన్నారు.రాష్ట్ర సాధన అనంతరం కూడా తెలంగాణ అమరుల ఆశయ సాధన కోసం జనసమితితో మమేకమై అన్ని ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొనే వారని అన్నారు.పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు గట్ల రమాశంకర్ మాట్లాడుతూ శ్రీను ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు చెప్పారు.పార్టీ జిల్లా అధ్యక్ష మాండ్ర మల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో . తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అద్యక్షులు తండు నాగరాజు , జిల్లా ఉపాధ్యక్షులు కంబాలపల్లి శ్రీను,మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ రఫీ , యువజన సమితి రాష్ట్ర నాయకులు బొడ్డు శంకర్, లక్కపాక నవీన్, ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్ దేవత సతీష్ , కిషోర్,శేఖర్ పాల్గొన్నారు.