పట్టణంలోని వసతులను మెరుగుపరిచి అభివృద్ధిలో గణనీయమైన మార్పులు తీసుకురావాలి -రాష్ట్ర పురపాలక పరిపాలన కార్యాలయం కమీషనర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ.

మహబూబాబాద్ బ్యూరో-జూన్ 9(జనంసాక్షి)

పట్టణంలో వసతులను మెరుగుపరిచి అభివృద్ధిలో గణనీయమైన మార్పులు తీసుకురావాలని రాష్ట్ర పురపాలక పరిపాలన కార్యాలయం కమీషనర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు రాష్ట్ర పురపాలక పరిపాలన కార్యాలయం కమీషనర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ (ఎం. ఏ.యు.డి.) సెక్రెటరీ సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి మరిపెడ పర్యటించి పనులను పరిశీలించారు. పట్టణ కేంద్రానికే తలమానికంగా నూతనంగా నిర్మించిన ఆడిటోరియం ను సందర్శించి అద్భుతంగా ఏర్పాట్లు చేశారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించి, వెంటనే ప్రారంభించి ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ముందస్తు ప్రణాళిక బద్దంగా పనుల పురోగతిని పరిశీలించాలని, పట్టణ ప్రగతి లో  పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని, నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో ప్రజల సౌకర్యార్థం పనులను చేపట్టాలని, అధికారులు, ప్రజా ప్రతినిధులు టీం వర్క్ చేసుకుని పట్టణాన్ని బాగు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్, మున్సిపల్ చైర్ పర్సన్ సింధూరి కుమారి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మరిపెడ మునిసిపల్ కమిషనర్, వార్డు కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నా