పట్టణాన్ని హరితంగా మార్చాలి
-కలెక్టర్ డాక్టర్ ఎ శరత్
జగిత్యాల, సెప్టెంబర్ 7 (జనంసాక్షి):హరితహారం కార్యక్రమం కింద పట్టణంలో మొక్కలు నాటి పట్టణాన్ని హరితంగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎశరత్ పేర్కొన్నారు. గురువారం తన చాంబర్‌లో అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూతాటిపల్లి నుంచి రాజారాం కెనాల్ వరకు రోడ్ల కిరువైపులా వయా చల్‌గల్ విూదుగా మొక్కలను నాటాలన్నారు. పట్టణంలోని రైస్‌మిల్లులు,ప్రైవేట్ విద్యాసంస్థలను సంప్రదించి మొక్కలను ట్రీగార్డ్‌సు సమకూర్చాలన్నారు. పట్టణంలోరోడ్లపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలన్నారు. పట్టణంలోని అన్ని రోడ్లకు ఇరువైపులా అర్బన్ పరిధిలోని వాటికి మున్సిపల్ కవిూషనర్,గ్రావిూణ ప్రాంతంలో వాటికి ఎంపిడిఓ ఎ/-లాంటేషన్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌కెఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో పొదలు తొలగించి పండ్ల మొక్కలు నాటాలని డ్రిప్ సౌకర్యం కల్పించేందకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఖిల్లాలో అభివృద్దికి మంచి ఏజెన్సీని గుర్తించాలన్నారు. పొదల మాదిరి స్థలాల్లో మొక్కలు నాటాలని వాకింగ్ ట్రాక్ నిర్మించాలన్నారు ఖిలాను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. మిని స్టేడియంలో కనీస సౌకర్యాల కల్పన చేయాలని మొక్కలు నాటాలని వాకింగ్ ట్రాక్ టాయ్‌లెట్స్ తదితరాలు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు అవసరమైతే ఆదిలాబాద్‌లోని మిని స్టేడియంను సందర్శించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. దర్మపురి టెంపుల్ సిటీని జగిత్యాల ఆర్డీఓ దత్తత తీసుకుని సుందరీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. నిధులు కోరతలేదని పనులు నాణ్యతతో ప్రణాళికాబద్దంగా చేపట్టాలన్నారు. ఈసమావేశంలో డీఆర్‌ఓ శ్యాంప్రకాశ్, జగిత్యాల ఆర్డీఓ నరెందర్ డీఆర్డీఓ అరుణ మున్సిపల్ కవిూషనర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.