పట్టణాభివృద్ధికి కృషి చేయాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): సూర్యాపేట మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్లుగా నియమింపబడిన వీఆర్ఓలు పట్టణాభివృద్ధికి కృషి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.సోమవారం మున్సిపల్ కార్యాలయంలో సిడిఎంఏ ఆదేశానుసారం మున్సిపాలిటీలో
జూనియర్ అసిస్టెంట్లుగా నియమింపబడిన వీఆర్ఓలకు ఏర్పాటు చేసిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.రెవెన్యూ శాఖ నుంచి పురపాలక శాఖకు వారిని స్వాగతించారు.అధికారికంగా జవాబుదారీతనం తెలిసిన వీఆర్ఓలు రెవెన్యూ శాఖాభివృద్దికి ఏ విధంగానైతే కృషి చేశారో అదే మాదిరిగా మున్సిపల్ శాఖకు కూడా సహకారాన్ని అందించి , అభివృద్ధికై పాటుపడాలన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికై చేస్తున్న కృషి అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.తమతో కలిసి సూర్యాపేట జిల్లా, పట్టణ అభివృద్ధికై తోడ్పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి, కోదాడ మున్సిపల్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డి , డీఎఫ్ఓ ముకుందా రెడ్డి , ఈఈ జీడికే ప్రసాద్ , డెవలప్మెంట్ ఆఫీసర్ ముకుందరావు, మేనేజర్ అలీ , మెప్మా అధికారి రమేష్ నాయక్ , ఎస్సై జనార్దన్ రెడ్డి , మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area