పట్నంలో ప్లాస్టిక్ బ్యాగ్ నిషేధం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంచలన నిర్ణయం రాబోతున్నది. పర్యావరణనానికి, నాలాల్లో నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ మొత్తం అమలు చేయాలని భావిస్తోంది. ఇంకా ఆమోద ముద్ర పడకపోయినా.. అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించింది. ప్రభుత్వం ఓకే అంటే.. ఆ క్షణం నుంచి నిషేధం అమలు చేయటానికి సిద్ధంగా ఉన్న జీహెచ్ఎంసీ

ప్లాస్టిక్ బ్యాన్ ఎందుకు?

హైదరాబాద్ లో రోజువారీగా చెత్త సేకరణ ఉంటుంది. ఇందులో 400 నుంచి 500 మెట్రిక్ టన్నుల వేస్ట్.. కేవలం ప్లాస్లిక్ వస్తువులే. ఏంటీ షాక్ అయ్యారా. ఇది అక్షర సత్యం. మొత్తం చెత్తలో 80శాతం ఈ ప్లాస్టిక్ ఉంటుంది. ఇది కేవలం జీహెచ్ఎంసీ సేకరించే చెత్తలోనే. ఇది కాకుండా కాలువలు, చెరువులు, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మనం వేస్తున్న ప్లాస్టిక్ ఎంతో తెలుసా.. అది 100 మెట్రిక్ టన్నులు. మొత్తంగా రోజుకు కనీసం ఎంత లేకున్నా.. 500 టన్నుల ప్లాస్లిక్ వస్తువులు వస్తున్నాయి. వీటి వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. ఆవులు తింటున్నాయి. నాలాలు పొంగిపొర్లటానికి కారణం కూడా ఈ ప్లాస్టిక్ వస్తువులే. ప్రజల్లో అవగాహన కల్పించిన ఆచరణలో మాత్రం అమలు కావటం లేదు. అందుకే అదీ ఇదీ అని లేకుండా మొత్తం ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

ఏయే ప్లాస్టిక్ కవర్లపై బ్యాన్ అంటే?

ప్రస్తుతం 50మెక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లపై ప్రస్తుతం నిషేధం ఉంది. ఇప్పుడు అయితే అసలు ప్లాస్టిక్ కవర్ల మొత్తంపైనే ఈ బ్యాన్ విధించబోతున్నారు. అంటే ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలు నిలిచిపోతాయి. షాపులు, హోటల్స్, చిరు వ్యాపారులు, వీధుల్లో వ్యాపారులు, వ్యక్తులు ఈ ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించినా.. విక్రయించినా వారిపైనా చర్యలు తీసుకుంటారు.

భారీ జరిమానాలు :

నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించినా, అమ్మినా భారీ జరిమానాలు విధిస్తారు. మొదటిసారి ఉల్లంఘిస్తే రూ.25వేలు, రెండోసారి ఉల్లంఘిస్తే రూ.50వేలు జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా దొరికితే షాపు లేదా పరిశ్రమ ఏదైనా సరే సీజ్ చేస్తారు.

మినహాయింపులు ఇలా :

పాలు, పాల ఉత్పత్తు ప్యాకింగ్ కు మినహాయింపు ఉంది. అదే విధంగా పర్యావరణ రహిత ప్లాస్టిక్ కవర్లు, షీట్లు, SEZలు, ఎగుమతి, దిగుమతి చేసుకునే పరిశ్రమల్లో ప్లాస్లిక్ ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుంది.