పఠాన్‌కోట్‌ రహస్యాన్ని చేధిస్తాం

1
– సీరియస్‌గా తీసుకున్న రక్షణశాఖ

న్యూఢిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పఠాన్‌ కోట్‌ ఏయిర్‌ బేస్‌పై ఉగ్రవాదుల దాడి సీరియస్‌గా తీసుకుంటామని, దీని రహాస్యాన్ని త్వరలోనే చే

ధిస్తామని రక్షణశాఖ తెలిపింది.పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోన్న భారత వైమానిక స్థావరంపై  ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై రక్షణ శాఖ కూపీ లాగుతోంది. దీనివెనక ఉన్న కుట్రను ఛేదిస్తామని అన్నారు. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు వీరమరణం పొందారు. అలాగే మూడు రోజుల పాటు ఆపరేషన్‌ కొనసాగించి మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. నాలుగు రోజులుగా సైన్యం అక్కడ కూంబింగ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. బుధవారంతో ఈ ఆపరేషన్‌ ముగిసింది. రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ కూడా దీనిపై ఆరా తీసారు. అసలు ద్రోహుఉల దేశంలోకి ఎలా ప్రవేశించారన్నది ఆరా తీసే పనిలో పడ్డారు.  ఘటన వెనక ఏం జరిగిందో ఛేదించడం తమకు సవాలని జాతీయ దర్యాప్తు సంస్థ చీఫ్‌ శరద్‌ కుమార్‌ అన్నారు. దర్యాప్తులో భాగంగా ఆయన బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీన్ని ఛేదించేందుకు  తామేవిూ డెడ్‌లైన్లు పెట్టుకోవడం లేదని వీలైనంత తొందరలో దీని వెనక ఏం జరిగిందన్న దాన్ని బయటకి లాగుతామని చెప్పారు. ఉగ్రవాదులు పాకిస్థానీయులా కాదా అనే దానిపై తమకు కొంత అనుమానం ఉందన్నారు. అయితే దాన్ని ధ్రువీకరించుకునేందుకు చనిపోయిన ఉగ్రవాదుల ఫోన్‌ కాల్స్‌ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇదిలావుంటే ఈ ఘటనపై ఇప్పటికే ప్రధాని మోదీతో ఫోన్‌లో పాక్‌ ప్రధాని నవాజ్‌ మాట్లాడారు. దీనిపై తాజాగా పాకిస్థాన్‌ రక్షణ శాఖ కూడా స్పందించింది.  భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య విభేదాలు పెంచడానికి విద్రోహులు చేసే కుట్రలు సఫలం కావని పాకిస్థాన్‌ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా మహమ్మద్‌ అసిఫ్‌ అన్నారు. బుధవారం ఆయనపాకిస్థాన్‌ రేడియోతో మాట్లాడుతూ.. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో భారత్‌ పాకిస్థాన్‌పై ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాల కోసం భారత్‌-పాక్‌ ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్‌షరీఫ్‌లు టెలిఫోన్‌లో చర్చించడమే ఉగ్రవాదులకు గట్టి సంకేతమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ కూడా ఉగ్ర బాధిత దేశమేనని, తీవ్రవాదంతో తామూ గట్టిగా పోరాడుతున్నామని అసిఫ్‌ పేర్కొన్నారు. మరోవైపు పఠాన్‌కోట్‌ ఘటనను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్‌ ఖండించారు. ఈ ఘటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌లు ఫోన్‌లో మాట్లాడుకోవడంపై ఆయన ఆరాతీశారు. ఇలాంటి సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాధ్యక్షులూ చూపుతున్న చొరవను ఆయన ప్రశంసించారు. ఈ విషయాల్ని ఆయన అధికారిక విూడియా ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ వెల్లడించారు.  ఘటన వెనక పాకిస్థాన్‌కు చెందిన ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐ హస్తం ఉందని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌కి చెందిన మాజీ అధికారి బ్రూస్‌ రియాడెల్‌ అన్నారు. ఆ సంస్థ 15 ఏళ్ల క్రితం తయారు చేసిన ఉగ్రవాద బృందమే ఇప్పుడు పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిందని చెప్పారు. మోదీ పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లక ముందే ఈ దాడికి రూపకల్పన జరిగిందని చెప్పారు.

పఠాన్‌కోట్‌ ఉగ్రఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ

పఠాన్‌కోట్‌ ఉగ్రఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఈ బృందం బుధవారం ఉదయం పఠాన్‌కోట్‌ చేరుకుంది. భద్రతాదళాల కాల్పుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల మృతదేహాలను ఫోరెన్సిక్‌ నిపుణుల ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. ఈ దర్యాప్తులో భాగంగానే.. ఇటీవల అపహరణకు గురై అనంతరం క్షేమంగా విడుదలైన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ని అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.