పడకేసిన పారిశుధ్యం, పల్లె ప్రగతిలో ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్   “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని క్యాచారం మరియు మున్నూరు సోమారం గ్రామాలలో పర్యటించారు.

◆ గ్రామంలో పారిశుధ్య పనులు పడకేయడంతో ఎమ్మెల్యే   అధికారులపై, ప్రజాప్రతినిధుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, పల్లె ప్రగతిలో ఏం పని చేశారని కనీస బాధ్యత లేకుండా విధులు నిర్వహించడం సరికాదని, గ్రామంలో వెంటనే పాడుబడ్డ ఇళ్లను, పిచ్చి మొక్కలను తొలగించి, శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలన్నారు.

◆ రోజు చెత్తబండి రావడం లేదని ప్రజలు ఎమ్మెల్యే  తెలుపగా… ప్రతి రోజు ఉదయం ఇంటింటికి వెళుతూ… గ్రామపంచాయతీ సిబ్బంది చెత్త సేకరించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.

◆ గ్రామంలోని ప్రతి బావి పై ఖచ్చితంగా పై కప్పులు ఏర్పాటు చేయాలన్నారు.

◆ గ్రామంలోని 3, 5, 7వ వార్డుల్లో నీళ్ళు రావడం లేదని తెలుపగా… గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇవ్వాలని, ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా చూసి, ప్రజలకు నీరు అందించాలని, ప్రజలు చెర్రలు తీయరాదని, గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి ప్రజలకు సరిపడా నీరు అందించాలన్నారు.

◆ గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేసి, అవసరమైన చోట నూతన స్థంబాలు ఏర్పాటు చేయాలని, ఊరి మధ్యలో ఉన్న ట్రాన్స్ఫర్మార్ వేరే ప్రదేశానికి మార్చాలని, అంతరాయలు లేకుండా విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు.

◆ ప్రతి మంగళవారం ఉదయం 8 గంటలకు గ్రామంలోని గ్రామపంచాయతీ దగ్గర పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని సంబంధిత శాఖ వారిని ఆదేశించారు.

▪️ అనంతరం మున్నూరు సోమారం గ్రామానికి చెందిన C. నర్సింలు కు దళిత బంధు పథకంలో మంజూరైన టెంట్ హౌస్ షాప్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు