పడిశాల వీరభద్రయ్య డిగ్రీ కళాశాలలో సన్మాన కార్యక్రమం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 14(జనం సాక్షి)
స్థానిక బట్టల బజార్ లోని పడిశాల వీరభద్రయ్య డిగ్రీ కళాశాలలో మంగళవారం రోజు విద్యా సంస్థల చైర్మన్ శ్రీ పడిశాల రాజగురులింగప్రసాద్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది . ఈ సమావేశం లో ఇటివల అక్టోబర్ న గాంధీజయంతి సందర్భంగా కాకినాడ రామచంద్రాపురం లో ఆర్ ఆర్ కిడ్స్ కాలేజీ లో రాజరత్న గ్రూప్ వారు ఐడీయల్ టీచింగ్ అవార్డు ప్రోగ్రంలో కంప్యూటర్ టీచర్ ఆఫ్ ద ఇయర్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ క్రెప్టోగ్రఫీ అవార్డును పడిశాల వీరభద్రయ్య డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ శ్రీమతి పొన్నగంటి భారతి గారికి అందించిన విషయానీ విద్యాసంస్థల చైర్మన్ పడిశాల రాజగురులింగప్రసాద్ గారు తెలియజేసారు .
ఈ సందర్భంగా అధ్యషులు మాట్లాడుతూ తమ సంస్థలో సేవలందిస్తున శ్రీమతి పొన్నగంటి భారతి గారికి ఈ అవార్డు రావడం సంతోషకరమైన విషయం అని పేర్కొనారు తమ సంస్థలో అధ్యాపక బృందం అంకితభావంతో , విద్యార్ధుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని తెలియజేసారు . పాఠశాల యాజమాన్యం సేవ తాత్పరత్ తో సంస్థను నడుతున్నరని తెలిపారు .అనంతరం శ్రీమతి భారతి గారిని పుష్పాగుచ్చం,శాలివాతో ఘనంగా సన్మానించారు .
Attachments area