పత్తికి రికార్డు ధర
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ. 4551 పలికింది. ఈ సీజన్‌లో ఇంత ఎక్కువ ధర పలకడం ఇదే తొలిసారి. గత వారం రోజుల నుంచి పత్తిధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 3900 కాగా అంతకుమించి ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శనివారం మార్కెట్‌కు 12000 బస్తాల పత్తి నిల్వలు చేరాయి. పత్తి గింజల ధరలు పెరుగు తుండటంతో పత్తి ధర సైతం పెరిగింది. పత్తి వ్యాపారులు మన రాష్ట్రం నుంచి మహరాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకు పత్తిని ఎగుమతి చేస్తున్నారు.