పత్తి కార్మికుల ఏఐటీయూసీ పోస్టర్ ఆవిష్కరించిన ఐఎల్ఓ ఇంటర్నేషనల్ డైరెక్టర్
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
పత్తి కార్మికులకు సామాజిక భద్రత గౌరవప్రదమైన వృత్తి కల్పించాలని,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వెట్టిచాకిరి నిర్మూలన తదితర అంశాలపై ఏఐటియుసి ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్( ఐ ఎల్ ఓ) ఏసియా పస్పిక్ డైరెక్టర్ డ్యగ్ మర్ వాల్టర్ ఆవిష్కరించడం జరిగింది. సోమవారం నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో జరిగిన పత్తి కార్మికుల హక్కులు సమస్యలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన తదితర అంశాలపై జరిగిన జిల్లా స్థాయి సదస్సులో ఆవిడ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది వారితోపాటు ఐ ఎల్ ఓ నేషనల్ కోఆర్డినేటర్ రంజిత్ ప్రకాష్, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గంగాధర్,జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ శర్మ, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బీవీ విజయలక్ష్మి, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ డి చంద్రశేఖర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, ఏఐటీయూసీ జిల్లా ప్రదాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై నాగన్న గౌడ్ , డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ నల్గొండ రాజేంద్రప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ సతీష్ ,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చాపల శీను, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురజ రామచంద్రం ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోలుగూరి నరసింహ, టిఆర్ఎస్ కే వి జిల్లా నాయకులు అవుట రవీందర్, సిఐటియు జిల్లా నాయకులు డి.సత్తయ్యవివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.