పదలు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మల్హార్, జనంసాక్షి: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యెయమని దానికోసమే తాము కృషి చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కరీంనగర్ జిల్లా మల్హార్ మండలంలోని రుద్రారంలో ఇందిరమ్మ కలల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. ఆవాస ప్రాంతాల్లో మౌలిక కల్పనకు గ్రామస్థుల ఏకాభిప్రాయం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి గురించి గ్రామస్థులు ప్రస్తావించగా తొందర్లోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఐఏటీ కింద రూ. 50 లక్షలు కేటాయించి రోడ్డు నిర్మాణం, మురికినీటి కాల్వలను నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త పాలనాధికారి అరుణ్‌కుమార్, తహశీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.