పది లో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ బడిపిల్లలను అభినందించిన ప్రజాప్రతినిధులు
చండ్రుగొండ జనంసాక్షి (జూలై 02) మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శనివారం జడ్పీటీసీ కొడకండ్ల వెంకటరెడ్డి ఎంపీటీసీ దారా వెంకటేశ్వర్రావు అభినందించారు.మిఠాయిలు తినిపించి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరొనా కారణంగా గత రెండు సంవత్సరాల పాటు తరగతులు నిర్వహించడంలో ఆటంకం ఏర్పడినప్పటికీ ఈ ఏడాది చక్కటి ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రతిభను చాటేందుకు ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సత్తెనపల్లి సత్యనారాయణ,ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉండేటీ ఆనంద్ కుమార్,నాయకులు చిదేళ్ల పవన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు