పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.
-కోపన్ కార్డులు అడుగుండ్రి .
– కొలువులు అడుగుండ్రి.
– 3 యేండ్లుగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.
దౌల్తాబాద్ నవంబర్ 20(జనం సాక్షి )దౌల్తాబాద్ మండల లోని నర్సంపల్లీ, మచిన్ పలి, అప్పయిపల్లి , గ్రామాలలో
ఇంటింటి ప్రచారము నిర్వహించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ గౌరవం తో బతికితే కే సి ఆర్ కు నచ్చదని, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా 10సంవత్సరాలనుండి మోసం చేసారని అన్నారు.
ఇంట్లో బిడ్డలకు కొలువులు వస్తే పెన్షన్ లకు ఆశపడే అవసరం ఎందుకు ఉంటుందో తల్లిదండ్రులు ఆలోచన చేయాలనీ కోరారు. పేద ప్రజల కోసం అని చెప్తున్నా సంక్షేమ పథకాలు కారు పార్టీ కార్యకర్తలకే వస్తున్నాయని అలాంటి పార్టీ కి ఓటు ఎందుకు ఏయాలని ప్రశ్నించారు. పేరుకు ఉచిత విద్యుత్ కానీ నెల నెల బిల్లులు మాత్రం తడిసి మొపెడు అవుతుందని అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత గ్రామాలలో రాత్రి పూట రోగమొస్తే మందుబిల్లా దొరకడం లేదు కానీ బెల్ట్ షాపులలో మద్యం 24 గంటలు దొరుకుతుందని పేర్కొన్నారు. మచిన్ పల్లి నుండి చేగుంట తూప్రాన్ హైవే వరకు రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధం అయ్యిందని, ఎన్నికల తరువాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పదేళ్లు పల్లెల మొఖం చూడని ప్రభాకర్ రెడ్డి ఓట్ల కోసం పల్లెల చుట్టు ప్రదక్షణాలు చేస్తున్నాడఅని అన్నారు. కుల సంఘం భవనలు కట్టిస్తామని మభ్యపెట్టాలని చూస్తున్నారని, మరి ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. గ్రామాలలో వుండే సమస్యల గురించి అవగాహనా లేని నాయకుడు గెలిచి ఏం ఒరగబేడతాడని అన్నారు. గ్రామాలలో యువత ను మద్యానికి బానిసలుగా చేసి ఓట్లు పొందే వ్యూహం తో అధికార బి ఆర్ ఎస్ పార్టీ, యువత ను మద్యానికి బానిసని చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోతరాజు కిషన్,జిల్లా కార్యవర్గ సభ్యులు కుమ్మరి నర్సింలు,అప్పయిపల్లి ఉప సర్పంచ్ ప్రభాకర్,కోనయిపల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి,పలు గ్రామల బూత్ అధ్యక్షులు,బిజెపి సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, గడ్డమీది స్వామి, ముత్యాల శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్ ,రంజిత్ గౌడ్, ప్రసాద్ రావు,నరసింహారెడ్డి,లక్ష్మణ్,బాలయ్య,యాదవరెడ్డి,మల్లేశం, రంజిత్,నవీన్ గౌడ్,రమేష్,బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు