పదో తరగతి ఫలితాల్లో బాలికలదే హవా

3

హైదరాబాద్‌, మే 17(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో తొలి టెన్త్‌ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. 79.04శాతం ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో నిలిచారు. బాలురలకు 76.11శాతం ఉత్తీర్ణత వచ్చింది. 91.6శాతంతో ఫలితాల్లో వరంగల్‌ జిల్లా అగ్రస్థానంలో నిలువగా?54.9శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్‌ జిల్లా చివరిస్థానంలో నిలిచింది. 14వందల 91 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత రాగా 28 పాఠశాలల్లో జీరో ఫలితాలు వచ్చాయి. జూన్‌ 18 నుంచి జలై 2వరకు పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు కడియం తెలిపారు.