పదో తరగతి విద్యార్థి అదృశ్యం
నవాబుపేట: ఇంట్లో నుంచి పాఠశాలకు వెళ్లిన పదోతరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం నవాబుపేట మండల కేంద్రానికి చెందిన దత్తాత్రేయ కొడుకు మల్లేషం(15) స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 3న ఇంట్లో నోటు పుస్తకాలను పెట్టి బయటికి వెళ్లాడు. ఆచూకి తెలియరాలేదు. దీంతో బంధువులు, తెలిపిన వారిని సంప్రదించినా ఫలితం లేకపోయింది. కొడుకు అదృశ్యమైనట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింగయ్య తెలిపారు.