పదో షెడ్యూల్‌లోని సంస్ధలు తెలంగాణకే
హైదరాబాద్ జూన్25(జనంసాక్షి): పదో షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్రంలోని సంస్థలు తెలంగాణకే చెందుతాయని అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పదో షెడ్యూల్‌పై ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏజీ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సంస్థలతో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ సంస్థల సేవలు అవసరమైతే.. వాటితో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఈ సంస్థలకు చెందిన నిధులన్నీ పూర్తిగా రాష్ట్రానికే చెందుతాయని పేర్కొన్నారు. పదో షెడ్యూల్‌లోని సంస్థలకు రాజకీయ నియామకాలు చేసుకోవచ్చని ఏజీ అభిప్రాయపడ్డారు. ఏజీ అభిప్రాయాలకు అనుగుణంగా అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.