పద్మవిభూషణ్‌ అందుకున్న రామోజీరావు

y2za6o8bదిల్లీ: రామోజీ సంస్థల అధిపతి రామోజీరావు పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆయనకు పద్మవిభూషణ్‌ పురస్కారం అందజేశారు. వాసుదేవ్‌ కల్‌కుంటే ఆత్రే, రజనీకాంత్‌, గిరిజాదేవి, శాంతా విశ్వనాథన్‌లు కూడా పద్మవిభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు.

హాజరైన ప్రముఖులు
పద్మ పురస్కారాల ప్రదానోత్సవానికి ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు.

పద్మభూషణ్‌ అందుకున్న వారు
* రవీంద్ర చంద్ర భార్గవ (ప్రజా వ్యవహారాలు)
* ఇందూజైన్‌( పారిశ్రామిక రంగం)
* ఉదిత్‌ నారాయణ్‌(కళా రంగం)
* హెచ్‌.కన్హయ్యాలాల్‌(కళా రంగం)
* సానియా మీర్జా(క్రీడా రంగం)
* డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌(సాహిత్యం)
* స్వామి తేజోమయానంద(ఆధ్యాత్మిక రంగం)
* రామ్‌ వి.సుతర్‌( కళలు, శిల్పకళ)
* ప్రొ.ఎన్‌.ఎస్‌. రామానుజ తాతాచార్య(సాహిత్యం)

పద్మశ్రీ పురస్కారం అందుకున్న వారు
* ఎస్‌.ఎస్‌.రాజమౌళి( కళా రంగం)
* ప్రియాంక చోప్రా (కళా రంగం)
* డా.మన్నం గోపీచంద్‌(వైద్య రంగం)
* సునీతా కృష్ణన్‌( సంఘ సేవ)
* ఎం.ఎం. వెంకటేశ్‌ కుమార్‌( కళా రంగం)
* మమతా చంద్రాకర్‌(కళా రంగం)
* జైప్రకాశ్‌ లేఖివాల్‌(పెయింటింగ్‌)
* బాలచంద్ర దత్తాత్రే మోందే(ఫొటోగ్రఫీ
* రవీంద్ర నాజర్‌(విద్యా రంగం)
* దాహ్యాభాయి శాస్త్రి(విద్యా రంగం)
* సోనూ ఘోష్‌(కళా రంగం)
* కామేశ్వరం బ్రహ్మ(విద్యా రంగం)
* జవహర్‌లాల్‌ కౌల్‌(విద్యా రంగం)
* డా.చంద్రశేఖర్‌ శేషాద్రి తొగులువా(వైద్య రంగం)
* డా. అనిల్‌ కుమారి మల్హోత్రా(వైద్య రంగం)
* సుధీర్‌ వి. షా(వైద్య రంగం)
* సైమన్‌ ఓరాన్‌(పర్యావరణం)
* రవీందర్‌కుమార్‌ సిన్హా(వన్యప్రాణ రక్షణ)
* డా.హెచ్‌.ఆర్‌. నాగేంద్ర(యోగా)
* ఉజ్వల్‌ నికమ్‌(ప్రజా వ్యవహారాలు)