పద్మశాలి ప్రతిభావంతులకు సన్మానం 

 

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 02(జనం సాక్షి)

 

పద్మశాలి ఆఫీషల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పద్మశాలి ప్రతిభావంతులైన వివిధ రంగాలలో ప్రగతి సాధించిన విద్యార్థులను ఆదివారం వరంగల్ నగరంలోని శివనగర్ పద్మశాలి కళ్యాణమండపం లో జరిగిన సమావేశంలో సన్మానించారు. రంగసాయిపేటకు చెందిన బీటెక్ సిఎస్సి లో రాంక్ సాధించిన చిదురాల పూజిత ను ముఖ్య అతిధిగా హాజరైన వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి పద్మశాలి సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, పోప రాష్ట్ర అధ్యక్షులు శమంతుల శ్రీనివాస్  మెమోంటో అందచేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూజిత తల్లిదండ్రులతో పాటు పలువురు పాల్గొన్నారు