పద్మావత్‌ విషయంలో చిల్లర రగడ

విడుదలను అడ్డుకోవడంలో అర్థం లేదు

న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): పద్మావత్‌గా మారిన పద్మావతి చిత్రం విడుదల అన్నది ఆయా రాష్టాల్ర దయాదాక్షిణ్యాలపై ఇప్పుడు ఆధారపడింది. దాదాపు బిజెపి పాలిత రాష్ట్‌ఆరల్లోనే దీనిని ఎక్కువగా విఆడుదల కాకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. సెన్సారు బోర్డు కూడా విచిత్రంగా పేరును పద్మావత్‌గా మార్చాలని చేసిన సూచన అపహాస్యం చేసేదిగా ఉంది. నిజంగానే చరిత్రను వక్రీకరించేలా ఉంటే ముందే సూచన చేయాలి. కానీ సెన్సార్‌ వాళ్లు ఓకే చేసిన తరవాత కూడా కొన్ని రాష్టాల్ర ప్రభుత్వాలు విడుదలను అడ్డుకోవడం అన్నది సమంజసంగా లేదు. దీంతో పద్మావత్‌ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాలు విడుదలను అడ్డుకోవాలని నిర్ణయించాయి. ఏకంగా సినిమా మొత్తంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ వ్యవహారం కొత్త చర్చకు దారితీస్తోంది. సినిమాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాల్సింది సెన్సార్‌ బోర్డు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలే సినిమాలను నియంత్రించేందుకు రంగంలోకి

దిగాయి. పద్మావతి సినిమా పేరును మార్చటంతోపాటు..కొన్ని మార్పులు చేయాలని సెన్సార్‌ బోర్డు సూచించటం..వాటిని చిత్ర యూనిట్‌ అంగీకరించటం జరిగిపోయింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమం అయినట్లే అని అందరూ భావించారు. కానీ ఏకంగా నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పద్మావత్‌ సినిమాను తమ తమ రాష్టాల్ల్రో విడుదలకు అంగీకరించబోమని ప్రకటించటం నిరంకుశ విధానంగా చూడాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నారనడానికి సమాధానం లేదు. సినిమాలో అభ్యంతరకర వ్యవహారాలు ఏమి ఉన్నాయన్నది వారికే తెలియదు. షూటింగ్‌ మొదలు పెట్టిన దగ్గరనుంచీ ఈ సినిమా వివాదాలతోనే సాగుతుంది. సెన్సార్‌బోర్డు అనుమతిచ్చినా.. అడ్డుకుంటామని కొంత మంది హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతోపాటు గుజరాత్‌, రాజస్తాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ తదితర రాష్టాల్రు చిత్ర విడుదలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. సినిమా విడుదలను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవడంపై పద్మావత్‌ నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎన్నో కష్టాలనోర్చి రూపొందించిన ‘పద్మావత్‌’ చిత్రానికి న్యాయం చేయాలని కోరుతూ నిర్మాతలు సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఇకపోతే

హిందీచిత్రం పద్మావత్‌ సినిమా విడుదలకుముందే దేశంలో పలుచోట్ల ఆందోళనలకు దిగడం, నటులను దర్శకులను బెదరించడం చూస్తుంటే సమాజంలో కొందరు ఎంతగా అసహనంగా ఉన్నారో అర్థం అవుతోంది. చరిత్రను వక్రీకరించే అంశాలు ఉంటే సెన్సార్‌ బోర్డు చూసుకుంటుంది. లేదా సినిమా విడుదలయ్యాక దానిని అడ్డుకోవచ్చు. విడుదల కాని సినిమాలో చరిత్రను వక్రీకరించారని చెబుతూ హింసోన్మాదాలకు దిగడం సరైనాదా కాదా అన్న వివేచన చేయాలి. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించే దృశ్యాలు లేవని దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ ఇప్పటికే స్పష్టం చేశారు. అయినా నటి దీపికా పడుకొనె, దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీల తలలు తెగనరుకుతామనేంత వరకు ప్రకటనలు చేశారు. నిజానికి చరిత్రను భ్రష్టు పట్టించే అనేక కార్యక్రమాలు సాగుతున్నాయి. సంస్కృతి విూద దాడులు జరుగు తున్నాయి. నిత్యం మతమార్పిళ్లు యధూచ్చగా సాగుతున్నాయి. మతమార్పిడులు చేస్తూ హిందువులను, హిందూ దేవుళ్లను, భారత చరిత్రను వక్రీకరి స్తున్నారు. ఇవన్నీ కూడా ఆగ్రహించాల్సిన అంశాలు. వాటిని వదిలి సినిమా విూద పడడం సరికాదు. అయితే సినిమాలు చారిత్రక వక్రీకరణ ఉంటే తప్పకుండా అడ్డుకోవా ల్సిందే. ఒకవేళ సినిమా విడుదలయ్యాక చరిత్రను వక్రీకరించినట్లుగా ఉంటే తప్పకుండా సినిమాను అడ్డుకోవలసిందే. లేదా చరిత్రకు సంబంధించిన వివరాలను ముందే సెన్సార్‌ బోర్డుకు సమర్పించి, అందుకు వ్యతిరేకంగా ఉంటే విడుదలకు అనుమతివ్వ కుండా చూడవచ్చు. సినిమా విషయంలో అవిూతువిూ

తేల్చుకోవాల్సింది సెన్సార్‌బోర్డు దగ్గరేనంటూ సుప్రీంకోర్టు కూడా తేల్చేసింది. చారిత్రక వాస్తవాలను తారుమారు చేసిన ఈ చిత్రం కనుక విడుదలైతే ప్రజాగ్రహం వెల్లువెత్తుతుందనీ, శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతుందనీ చెప్పి సినిమా విడుదలను అడ్డుకుంటున్నట్లు ఆయా రాష్టాల్ర సిఎంలు ప్రకటించారు. చిత్రాన్ని వ్యతిరేకించే ముందు, దాన్ని చూడాలని, ఏమైనా అభ్యంతర కరంగా అనిపిస్తే అలాంటి సన్నివేశాలను తొలగించాలని కోరవచ్చని ఇప్పటికే పలువురు పేర్కొన్నారు. మొత్తంగా సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. పద్మావత్‌గా మారినా విడుదలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మొత్తంగా బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ తీసిన ‘పద్మావతి’ చిత్రం విడుదల అవుతుందా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. ‘పద్మావత్‌’ విషయంలో యూపీతో పాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్టాల్రు కుల పరువు కాపాడే పేరిట కర్ణిసేన వంటి సంస్థలు చేస్తున్న హెచ్చరికలను అడ్డుకోవాలి. దీనికితోడు, చిత్తోర్‌గఢ్‌

వంటి ఒక చిన్న రాజ్యాన్నీ, రాజునూ, పద్మావతినీ, ఖిల్జీనీ చిత్రీకరించే విషయంలో సినిమాకు కావలసిన రంగులూ హంగులూ అద్దడం తప్ప మూలం నుంచి తాను ఏమాత్రం గాడితప్పలేదని బన్సాలీ చెబుతున్నారు. షూటింగ్‌ ప్రారంభానికి ముందునుంచే ఆయన పద్మావత్‌ పాత్రపై తన గౌరవాన్ని చాటిచెబుతూ, ఖిల్జీ పాత్రకూ, ఆమె పాత్రకూ మధ్య రాజపుత్రులకు రుచించని ఎలాంటి సన్నివేశాలూ ఉండబోవని హావిూ ఇస్తూనే ఉన్నారు. అయినా ఆయా రాష్టాల్రు నిషేధం విధించి ప్రజల స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన విషయంగా మాత్రమే చూడాలి.