పనాజీ స్థానం సొంతం చేసుకున్న బిజెపి

పనాజీ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): గోవాలోని పనాజీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భాజపా విజయం సాధించింది. ఇక్కడ ప్రతానిధ్యం వహిస్తున్న నాటి ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ రాజీనామా  చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఆయన కేంద్ర రోణశాఖ మంత్రిగా వెళ్లడంతో ఎన్నిక జరగ్గా  ఆరోసారి కూడా పనాజీ స్థానాన్ని భాజపా సొంతం చేసుకుంది. 1994 నుంచి పనాజీ స్థానానికి రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి సిద్దార్థ్‌… కాంగ్రెస్‌ అభ్యర్థి సురేంద్ర ఫర్టాడోపై 5,368 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నవంబరులో మనోహర్‌ పారికర్‌ రక్షణశాఖ మంత్రిగా నియమితులవడంతో పనాజీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. మోడీ ప్రధాని అయ్యాక పారికర్‌ను కేంద్రంలోకి తీసుకున్నారు.