పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి !
( ఆధ్యాత్మిక చింతన )
తిరుమల,మార్చి9(జనం సాక్షి): మిడత ఓ అల్పప్రాణి. శక్తికి తగిన పని మాత్రమే చేయాలన్నదానికి అది సంకేతం. ఆశకు ప్రలోభాలకు లొంగి, భ్రమపడి మనిషి తలకు మించిన భారాన్ని మోయకూడదు. తుమ్మెద` సారాన్ని గ్రహిస్తుంది. అదే కోవలో, మనిషి తన శ్రవణెళింద్రియాలతో మంచినే వినాలి. కర్మేంద్రియాలతో సత్కర్మాచరణ చేయాలి. ఏనుగును పట్టేందుకు గొయ్యి తీసి, పైన పచ్చని ఆకులు, కొమ్మలు పరుస్తారు. ఆశతో కూడిన కోర్కెలతో ఏనుగు అటుగా వెళ్ళి గోతిలో పడిపోతుంది. కోరికలు అదుపులో లేకుంటే మనిషి పరిస్థితీ అంతే! తేనెటీగ నిరంతర శ్రమకు నిదర్శనం. కష్టపడి తేనెను సేకరించి, దాచిపెడుతుంది. తిరిగి శ్రమిస్తూనే ఉంటుంది. ప్రతిబంధకాలెదురైనా, సాధకుడు తన ప్రయత్నాన్ని పట్టుదలగా కొనసాగించాలన్న
సత్యాన్ని అది చెబుతుంది. లేడిది విశ్లేషణా శక్తి. తాబేలు ఇంద్రియ నిగ్రహాన్ని సూచిస్తుంది. ముంగిస` దొరికినదే పెన్నిధిగా భావిస్తుంది. ఇవన్నీ మనిషి గ్రహించాల్సిన సూత్రాలు. సాలీడు లాలాజలంతో గూడు అల్లుకొంటుంది. దానిలో చిక్కువడదు. అలాగే మనిషి బంధాలు, మమకారాలు, నేను`నాది అనే ఊబిలో చిక్కుకోరాదు. ఆత్మరక్షణా కవచాన్ని సృష్టించుకోవాలి. పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి.నూరేళ్ళ జీవితం` భగవానుడిచ్చిన వరం. మనిషి చుట్టూ ఉన్న ప్రపంచం ఆనందంగా ఉండాలి. అందుకు అతడు సత్యశోధకుడు కావాలి. జీవరాశుల్ని గురువులుగా భావించే తీరుతో, మరింత జ్ఞాన సంపన్నుడు కావాలి! ( ఆధ్యాత్మిక చింతన )
తిరుమల,మార్చి9(జనం సాక్షి): మిడత ఓ అల్పప్రాణి. శక్తికి తగిన పని మాత్రమే చేయాలన్నదానికి అది సంకేతం. ఆశకు ప్రలోభాలకు లొంగి, భ్రమపడి మనిషి తలకు మించిన భారాన్ని మోయకూడదు. తుమ్మెద` సారాన్ని గ్రహిస్తుంది. అదే కోవలో, మనిషి తన శ్రవణెళింద్రియాలతో మంచినే వినాలి. కర్మేంద్రియాలతో సత్కర్మాచరణ చేయాలి. ఏనుగును పట్టేందుకు గొయ్యి తీసి, పైన పచ్చని ఆకులు, కొమ్మలు పరుస్తారు. ఆశతో కూడిన కోర్కెలతో ఏనుగు అటుగా వెళ్ళి గోతిలో పడిపోతుంది. కోరికలు అదుపులో లేకుంటే మనిషి పరిస్థితీ అంతే! తేనెటీగ నిరంతర శ్రమకు నిదర్శనం. కష్టపడి తేనెను సేకరించి, దాచిపెడుతుంది. తిరిగి శ్రమిస్తూనే ఉంటుంది. ప్రతిబంధకాలెదురైనా, సాధకుడు తన ప్రయత్నాన్ని పట్టుదలగా కొనసాగించాలన్న
సత్యాన్ని అది చెబుతుంది. లేడిది విశ్లేషణా శక్తి. తాబేలు ఇంద్రియ నిగ్రహాన్ని సూచిస్తుంది. ముంగిస` దొరికినదే పెన్నిధిగా భావిస్తుంది. ఇవన్నీ మనిషి గ్రహించాల్సిన సూత్రాలు. సాలీడు లాలాజలంతో గూడు అల్లుకొంటుంది. దానిలో చిక్కువడదు. అలాగే మనిషి బంధాలు, మమకారాలు, నేను`నాది అనే ఊబిలో చిక్కుకోరాదు. ఆత్మరక్షణా కవచాన్ని సృష్టించుకోవాలి. పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి.నూరేళ్ళ జీవితం` భగవానుడిచ్చిన వరం. మనిషి చుట్టూ ఉన్న ప్రపంచం ఆనందంగా ఉండాలి. అందుకు అతడు సత్యశోధకుడు కావాలి. జీవరాశుల్ని గురువులుగా భావించే తీరుతో, మరింత జ్ఞాన సంపన్నుడు కావాలి!