పరాజయం పాలైన పాక్‌ ప్రముఖులు

ఇస్లామాబాద్‌, పాకిస్థాన్‌లో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పరాజయం చవిచూశారు. పీపీపీకి చెందిన మాజీ ప్రధాని రాజా పర్వేజ్‌ అష్రఫ్‌, మాజీ సమాచార ప్రసార శాఖ మంత్రి ఖమర్‌ జమాన్‌ కైరా, ఫిర్‌దౌన్‌ ఆశిఖ్‌ అవాన్‌, మంజూర్‌ అహ్మద్‌ వట్టూ, పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ నదీం అఫ్జల్‌, బారిష్టర్‌ చౌదరి ఐజాజ్‌ అహసాన్‌ భార్య బుష్రా ఐజాజ్‌, మాజీ మంత్రి నజర్‌ మహమ్మద్‌ గోండాల్‌, తస్లీం ఖురేషీ, గిలానీ ఇద్దరు కుమారులు ఓటమిపాలయ్యారు. గిలానీ కుమారుల్లో ఒకరు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఏఎన్‌పీ చీఫ్‌ అస్పందయార్‌ వలీ ఖాన్‌ కూడా పరాజయం పాలయ్యారు. 1985 నుంచి ఎన్నికల్లో గెలుపొందుతూ వస్తున్న ఛౌధరి అలీ చీమను కూడా ఈ సారి దురదృష్టం వెన్నాడింది. ఇమ్రాన్‌ఖాన్‌ కూడా ఒకచోట గెలిచినా మరో చోట ఓటమి పాలయ్యారు.