పరాయిదేశంలో భారత్ పరువు తీస్తావా?
– మోదీపై ఒమర్ అబ్దుల్లా ఫైర్
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనలలో ఉన్న సమయంలో గత ప్రభుత్వాలను విమర్శించడం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తప్పిదమని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా విమ ర్శించారు. ఇలా వ్యాఖ్యనించడంలో మోదీ ఉద్దేశం.. కేవలం నేను, నేనొ క్కడినే అనే తీరుగా వ్యవహరించడమేనని ఓమర్ వ్యాఖ్యానించారు.మోదీని విమర్శించడంతో పాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ గురించి మాట్లాడుతూ.. కొన్ని రోజుల పాటు అజా ్ఞతానికి వెళ్లే ముందు ఉన్న రాహుల్ కు, ప్రస్తుతం కనిపిస్తున్న రాహుల్ కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ప్రధాని మోదీ పాలనపై రాహుల్ గాంధీ చా లా చక్కని విషయాలు, లోపాలు ఎత్తిచూపారని ఓమర్ మెచ్చుకున్నారు. రా హుల్ తీరును చూసి ఆశ్చర్యానికి లోనయినట్లు చెప్పారు.విదేశీ పర్యటనలో ప్రతిపక్షాలను విమర్శించడం మోదీ తప్పిదమని
గతంలో విదేశాంగ శాఖ సహాయమంత్రిగా చేసిన ఓమర్ అబ్దుల్లా అభివర్ణించారు. భారత్ లో పుట్టినందుకు సిగ్గుపడుతున్నామని విదేశాలలోని భారతీయులు అంటున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఓమర్ ఖండించారు.