పరిమళించిన మానవత్వం.. జర్నలిస్టు వైద్యం కోసం చేయూత.

 

ఎస్పి రాహుల్ హెగ్డే ఆర్థిక సహాయం.

అండగా నిలిచిన జర్నలిస్టు మిత్రులు.

సిరిసిల్ల. సెప్టెంబర్ 12 (జనం సాక్షి). ఎన్నో మానవ కథనాలను అందించి కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించేందుకు అలుపెరుగక పనిచేసే జర్నలిస్టు మిత్రులకు అనుకోని అవాంతరాలు ఎదురైతే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన నవ తెలంగాణ దినపత్రికలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కారంగుల వినోద్ రావు సోమవారం హైబీపీతో పడిపోయారు. మెదడులో బ్లీడింగ్ జరుగుతుండడంతో పరిస్థితి విషమంగా మారింది. జర్నలిస్టు మిత్రులు కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించడంతో ఒకరోజు యశోద ఆసుపత్రిలో చికిత్సల అనంతరం ప్రస్తుతం నీమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. కుటుంబం గడవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో వైద్యం అందించలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబానికి. సిరిసిల్ల, తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ మిత్రులతో పాటు జిల్లాలోని పలువురు జర్నలిస్టులు స్థానికులు, కొందరు కార్మికులు తమకు తోచిన విధంగా ఆర్థికంగా చేయూత అందిచారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే 20వేల ఆర్థిక సహాయాన్ని వినోద్ రావు వైద్యం కోసం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాలమాకుల శేఖర్ కు అందజేశారు. స్థానిక శాసనసభ్యులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వినోద్ రావుకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. కేటీఆర్ పి కుంభాల మహేందర్ రెడ్డి నిమ్స్ ఆసుపత్రిలో వినోద్ రావుకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతూ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలిపారు. కష్టాల్లో ఉన్న జర్నలిస్ట్ కుటుంబానికి మానవత దృక్పథంతో సహాయం అందిస్తూ అనేకమంది చేయితనిస్తూ అండగా నిలుస్తున్నారు.