పరివాహక ప్రాంతంపై ప్రత్యేక దృష్టి

ఏలూరు,ఫిబ్రవరి24(జనం సాక్షి): ప్రజలకు ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా అధికారులు తెలిపారు. జనాభా పెరుగుదల వలన ఈ పరివాహక ప్రాంతం కలుషితంగా మారుతుందన్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. దీనికి అనుబంధంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, పంచాయితీరాజ్‌శాఖ, నీటిపారుదల శాఖ, కాలుష్యనియంత్రణా మండలి, పురపాలక సంఘాల అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. మూడు దశల్లో ఈ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నామన్నారు. జిల్లాలో ప్రజలందరికీ ఆరోగ్యమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. దీనికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు.