పరీక్షలేవైనా ఫలితాల్లో బెల్లంపల్లి సి ఓ ఈ విద్యార్థులదే హవా.

బెల్లంపల్లి, సెప్టెంబర్11,(జనంసాక్షి)
పరీక్షలేవైనా ఫలితాల్లో బెల్లంపల్లి సిఓఈ విద్యార్థులదే హవా అన్నట్లుగా తమ సత్తా చాటుతున్నారు. గత విద్యాసం ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ సాధించారు. అదేక్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ప్రకటించిన జెఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ (సి ఓ ఈ) బెల్లంపల్లి విద్యార్థులు తమ సత్తా చాటారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు 35 మంది జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరై అత్యంత ప్రతిభ చూపి జేఈఈ అడ్వాన్స్డ్ కు 20 మంది అర్హత సాధించారు. ఆగస్టు 28న జరిగిన అడ్వాన్స్డ్ పరీక్ష కు హాజరైన 20 మందిలో నలుగురు విద్యార్థులు క్వాలిఫై అయినట్లు ప్రిన్సిపల్ అయినాల సైదులు తెలిపారు. వీరిలో కేతావత్ ప్రకాష్ 1379 ర్యాంకు సాధించగా జాడి అరవింద్ సాయి 3321 ర్యాంకు, కొఠారి పవన్ కుమార్ 3503 ర్యాంకు, మునిమడుగుల సిద్ధార్థ 4356 జాతీయస్థాయి ర్యాంకులు సాధించారు. జోస నిర్వహించే కౌన్సిలింగ్లో వీరికి ఐఐటి కోర్సులు ప్రవేశం లభించే అవకాశం ఉన్నదని ప్రిన్సిపల్ తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ అయినాల సైదులును, అధ్యాపకులను, ఆర్సిఓ కొప్పుల స్వరూప రాణి, ఏఆర్సిఓ కోటి చింతల మహేశ్వరరావు, డిసిఓ రామల బాల భాస్కర్ లు అభినందించారు.