పరీక్షల నిర్వహణ విజయవంతానికి కృషి చేసిన అధికారులను అభినందించిన కలెక్టర్…
జనగామ (జనం సాక్షి)అక్టోబర్ 18.జిల్లాలో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలను కనుగుణంగా ఏర్పాట్లు చేసి పరీక్షల విజయవంతానికి కృషి చేసిన అధికారులు అందరికీ పేరుపేరునా జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అభినందించారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అధికారుల ఉద్దేశించి మాట్లాడారు. ఉన్నతాధికారుల నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించిన అధికారులను కలెక్టర్ ప్రశంసించారు ఇదే స్ఫూర్తితో మునుముందు కూడా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరారు.ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేస్తూ జిల్లాకు మంచి పేరు తేవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు జిల్లా పనితీరును ఉన్నతాధికారులు కూడా ప్రశంసిస్తున్నారని ఇదే తరహాలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.