పరేడ్ గ్రౌండ్‌ చుట్టూ పటిష్ఠ భద్రత

17wkxfy6గణతంత్ర దినోత్సవానికి మూడంచల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశామని హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి గుర్తింపు కార్డులు తప్పనిసరి అన్నారు. సందర్శకులను పూర్తిగా తనిఖీ చేశాకే లోనికి పంపుతామన్నారు. ఉగ్రవాద సానుభూతిపరులపై నిరంతర నిఘా ఉంచామన్నారు. కేంద్ర నిఘా వర్గాలతో సమన్వయంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. పరేడ్ గ్రౌండ్‌ చుట్టూ పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ ను కూడా వేరే మార్గాల గుండా మల్లింపు చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తామని సీపీ తెలిపారు. పార మిలిటరీ బలగలాతో పాటు.. ఆర్పీఫ్‌ను కూడా మొహరిస్తామన్నారు.