పర్యావరణ దినోత్సవ సందర్భంగా

ప్రకృతి మొగ్గలు
 
తాను కరుణిస్తే పచ్చదనం
తాను కళ్ళెర్ర జేస్తే ప్రళయం
అదే కదా ప్రకృతి మహత్యం
 
మణి మాణిక్యాలకన్నా విలువైనవి
మన మనుగడకు సహాయపడేవి
వెలలేని ప్రకృతిలోని ఋతురాగాలు
 
పచ్చదనాన్ని పంచే వృక్షాలు
ఆక్సిజన్ ను పెంచే మొక్కలు
ఆరోగ్యాన్ని అందించే వనదేవతలు
 
 
పశువులు సైతం ప్రకృతికి సహాయపడుతుంటే
మనుషులే ప్రకృతిని నాశనం చేస్తుంటే 
తరువాతి తరాలకు పచ్చదనం మిగిలేదెలా
 
చెట్లని నరకి భవనాలు నిర్మించడం
చల్లదనం ఏదని సూర్యుడిని నిందించడం
 ప్రకృతి పట్ల ఏమిటో ఈ మనుషుల దౌర్జన్యం
 
 
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918