పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో అవసరం:
హుస్నాబాద్ రూరల్ జూలై 04(జనంసాక్షి) పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో అవసరమని పందిళ్ళ సర్పంచ్ తోడేటి రమేష్ అన్నారు. మండలంలోని పందిళ్ళ గ్రామ పంచాయితీలో రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటి వాటి పరిరక్షణ కోసం మొక్కలకు ఇరువైపుల కంచెలు నాటి చెట్లు సంరక్షణపై దృష్టి సారించినట్లు తెలిపారు. పర్యావరణం బాగుండాలంటే, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మొక్కలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. మొక్కలు నాటడం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడి వర్షాలు పుష్కలంగా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Attachments area