పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.మంగళవారం ఎస్బీఐ  ఆర్ఎం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జడ్పిహెచ్ఎస్ , పిల్లలమర్రిలో నిర్వహించిన వన ప్రేరణ మహోత్సవంలో పొల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు.అనంతరం విద్యార్థులకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ ఎస్సై సాయిరాం, వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ , టిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాస్, బ్యాంకు ఉద్యోగులు  రవి ప్రసాద్ , భాస్కర్ , సైదులు, మహేష్ , సిజిఆర్ వాలంటీర్లు రాపర్తి మహేష్ , మాదగొని ఉపేందర్, దాసరి శంకర్, వెంకటేష్ , సిహెచ్ కరుణాకర్,  సందీప్, విష్ణు, నరేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు.