*పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి::

జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి*

మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
నల్గొండ బ్యూరో. జనం సాక్షి ,:- పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో సమావేశ మందిరం ఆవరణ లో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ సంరక్షణ కోసం జిల్లాలో 1000 మట్టి విగ్రహాలను కలెక్టరేట్ లో,మున్సిపల్ కమిషనర్ ద్వారా పట్టణం లో ప్రజల కు మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆదిదేవుడైన వినాయకుని మట్టితో తయారు చేసి పూజించటం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని, మన ఆకాంక్షలు నెరవేరుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణ సంరక్షణ జరుగుతుందని, మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని, బయట మాస్కులు ధరించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి వెనుక బడిన తరగతుల ఆర్థిక సంస్థ ద్వారా శిక్షణ పొందిన శాలివాహన,కమ్మరి సంఘాల వారికి ఉపాధికి దోహదం చేస్తూ పని కల్పించి తయారు చేపించినట్లు తెలిపారు.జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారిణి పుష్పలత,
కలెక్టరేట్ సిబ్బంది,
సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజావార్తలు