పలు కార్యక్రమాలను జయప్రదం చేయండి..
ఎంపీపీ బక్క రాధజంగయ్య.
ఊరుకొండ, సెప్టెంబర్ 18 (జనం సాక్షి):
ఊరుకొండ మండలంలోని ఆయా గ్రామాలలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమాలకు మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఎంపీపీ బక్క రాధజంగయ్య పిలుపు నిచ్చారు. ఎంపీపీ విలేకరులతో మాట్లాడుతూ.. సోమవారం ఉదయం రాచాలపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, ఎంపీపీ నిధులతో అండర్ డ్రైనేజ్ శంకుస్థాపన కార్యక్రమం, రేవల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమం, మాదారం గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం, ఊరుకొండ పేట గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, మరియు మధ్యాహ్నం ఇప్పపహడ్ గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు, మండల జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, ఎంపిటిసిలు, సర్పంచులు, మండల కో ఆప్షన్ సభ్యులు, తెరాస రాష్ట్ర జిల్లా, మండల నాయకులు, రైతుబంధు మండల అధ్యక్షులు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు, తెరాస కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.