పలు దేశాల్లో ఆగస్ట్‌ 15ననే స్వాతంత్య్ర ఉత్సవాలు

14ననే పాక్‌ ఆవిర్భావం…స్వాతంత్య్ర దినోత్సవం
కొరియా దేశాల్లోనూ నేడే స్వాతంత్య్ర దినోత్సవం
న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి)  భారతదేశం తెల్లదొరల పాలన నుండి విముక్తి పొందిన రోజు.. బానిసత్వం నుండి స్వేచ్ఛను సంపాదించుకున్న రోజూ ఆగస్టు 15. దేశం యావత్తు ఆగస్టు 15న దేశభక్తితో పులకరిస్తుంది. అదేరోజు దేశ విభజన కూడా జరిగింది. పాక్‌ పురుడు పోసుకుంది. 14ననే ఇష్టం వచ్చినట్లుగా గీసిన రేఖతో పాక్‌ ఏర్పడ్డది. అందులో భారత్‌లోని తూర్పు బెంగాల్‌ కూడా కలిసింది. తదనంతర పరిణామాల్‌ఓ తూర్పు బెంగాల్‌ కాస్తా బంగ్లాదేశ్‌గా అవతరించింది. అయితే భారతదేశం మాత్రమే కాదు.. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలలో ఆగస్టు 15న స్వాతంత్యద్రినోత్సవ వేడుకలు జరుగుతాయి. దక్షిణ కొరియా 1945, ఆగస్టు 15న జపనీస్‌ పాలన నుండి విముక్తి పొందింది. స్వాతంత్య దినోత్సవ వేడుకను అక్కడ గ్వాంగ్‌బోక్‌జియోల్‌ అని అంటారు. అంటే కొత్త వెలుగు పునరిద్దరణ పొందిన రోజు అని అర్థమట. ఈ రోజున దక్షిణ కొరియాలో కూడా వేడుకలు, కవాతులు , సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. అంటే మనకన్నా రెండేళ్ల ముందే స్వాతంత్య్రంపొందింది. ఉత్తర కొరియా కూడా జపాన్‌ ఆక్రమణ నుండి స్వతంత్యాన్ని ఆగస్టు 15నే పొందింది. అక్కడ స్వాతంత్య దినోత్సవ వేడుకను చోగుఖేబాంగ్‌’యిల్‌ అని పిలుస్తారు. ఇక్కడ వేడుకలు రాష్ట్రవ్యవస్థీకృతమైనవి. బహిరంగంగానే ఈవెంట్లు జరుగుతాయి. సైనిక కవాతులు, ప్రసంగాలు, దేశభక్తి కార్యక్రమాలు జరుగుతాయి. కొరియా కాస్తా ఉత్తర దక్షిణ కొరియాలుగా విడిపోయింది. రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో ఆగస్టు 15, 1960 న ఫ్రాన్స్‌ నుంచి సంపూర్ణ స్వాతంత్య్రం పొందింది. ఇది ఫ్రెంచ్‌ పాలనలో పడిపోయి సరిగ్గా 80 సంవత్సరాలు. 1969 నుండి 1992 వరకు దేశం మార్కిస్ట్‌ లెనినిస్ట్‌ రాజ్యంగా ఉంది. ఆ తరువాత బహుళ పార్టీ ఎన్నగల నిర్వహణకు మారింది. కవాతులు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలతో వేడుకలు జరుగుతాయి. ఆగస్టు 15 లిచెన్‌ స్టెయిన్‌ స్వాతంత్య దినోత్సవం కాదు. కానీ ఆ దేశపు జాతీయ దినాన్న ఆగస్టు 15న జరుపుకుంటారు. చాలా దేశాలలో జరుపుకునే అజంప్షన్‌ అనే మతపరమైన పండుగ సందర్బంగా ఆగస్టు 15ను సెలవు దినంగా జరుపుకుంటారు. దేశ సార్వభౌమాధికారం, గుర్తింపు కోసం అక్కడి యువరాజు ఉత్సవాల రూపంలో ఆగస్టు 15ను వేడుకగా నిర్వహిస్తారు. ఆగస్టు 15, 1971 న యునైటెడ్‌ కింగ్డమ్‌ నుండి బహ్రెయిన్‌ స్వాతంత్యాన్ని పొందింది. 1931లో చమురును కనుగొని చమురు
శుద్ది కర్మాగారాన్ని స్థాపించిన మొదటి గల్ఫ్‌ దేశాలలో ఇది ఒకటి. అదే సంవత్సరం బ్రిటన్‌, ఒట్టోమన్‌ ప్రభుత్వాలు బహ్రెయిన్‌ స్వాతంత్యాన్ని గుర్తిస్తూ సంతకాలు చేసినా 1971 వరకు బ్రిటన్‌ పాలనలో కొనసాగింది. ఆ తరువాత బ్రిటన్‌ తో స్నేహ ఒప్పందం చేసుకుంది. బహ్రెయిన్‌ స్వాతంత్య దినోత్సవం ఆగస్టు 14 న పేర్కొన్నా అధికారికంగా ఆగస్టు 15 న నిర్వహిస్తారు.